logo

రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు ఆయన మానస విద్యాలయం రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో బుధవారం పాఠశాల ప్రిన్సిపల్‌ ఖమర్‌ సుల్తానా, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన నివాళులర్పించారు.

Updated : 13 Jun 2024 05:00 IST

 నివాళులర్పిస్తున్న ప్రిన్సిపల్‌ ఖమర్‌సుల్తానా, ఉపాధ్యాయులు, సిబ్బంది

అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు ఆయన మానస విద్యాలయం రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో బుధవారం పాఠశాల ప్రిన్సిపల్‌ ఖమర్‌ సుల్తానా, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా తొలిరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఖమర్‌సుల్తానా, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి రామోజీరావుకు అంజలి ఘటించారు. పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు సింహ రచించి స్వర కల్పన చేసిన ‘‘మహాప్రస్థానం.. మరో ప్రపంచ నిర్మాణం మీతోనే.. మీతోనే..’ అనే గీతాన్ని ఆలపించి రామోజీరావు ఆత్మశాంతికి ప్రార్థించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ ఖమర్‌సుల్తానా మాట్లాడుతూ.. రామోజీరావు ఆయా రంగాల్లో సాధించిన విజయాలు, అందించిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని, ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారను.. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

మౌనం పాటిస్తున్న విద్యార్థులు 

 త్యాగరాయ గానసభలో సంతాప సభ రేపు

హిమాయత్‌నగర్, న్యూస్‌టుడే: అక్షర యోధుడు, ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు సంతాప సభ ఈనెల 14న శుక్రవారం ఉదయం 10.30 గంటలకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిడి సోమయ్య, బి.బసవ పున్నయ్య  తెలిపారు. ఈ సంతాప సభలో పలువురు సీనియర్‌ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొంటారని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని