logo

పాఠశాల బస్సులపై కొరడా

గ్రేటర్‌వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు తెరుచుకున్న దృష్ట్యా రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫిట్‌నెస్‌ లేకపోవడంతోపాటు త్రైమాసిక పన్నులు చెల్లించకుండా రోడ్డెక్కిన బస్సులపై కొరడా ఝుళిపించారు.

Published : 13 Jun 2024 02:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు తెరుచుకున్న దృష్ట్యా రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫిట్‌నెస్‌ లేకపోవడంతోపాటు త్రైమాసిక పన్నులు చెల్లించకుండా రోడ్డెక్కిన బస్సులపై కొరడా ఝుళిపించారు. హైదరాబాద్‌ పరిధిలో 25 బస్సులను సీజ్‌ చేసినట్లు సంయుక్త రవాణాశాఖ అధికారి రమేష్‌ తెలిపారు. ఇందులో 19 బస్సులు ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. మరో 6 బస్సులు త్రైమాసిక పన్నులు చెల్లించకుండా తిరుగుతున్నట్లు తేలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అయిదు బృందాలు బడి బస్సులను తనిఖీలు చేశాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని