logo

పబ్బుల్లో అమ్మాయిలతో ఎర.. డబ్బు గుంజేసే ముఠా

ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ల ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి పబ్బుల్లో దందా నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు అరెస్టుచేశారు.

Updated : 13 Jun 2024 04:59 IST

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వినీత్, వెనుక వరుసలో నిందితులు 

మాదాపూర్, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌ల ద్వారా అమ్మాయిలను ఎరగా వేసి పబ్బుల్లో దందా నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్‌ పోలీసులు అరెస్టుచేశారు. నకిలీ ఐడీలతో డేటింగ్‌ యాప్‌లలో అమ్మాయిల చిత్రాలు ఉంచి అబ్బాయిలతో ఛాటింగ్‌ చేయడం, పబ్‌లకు రప్పించి ఖరీదైన మద్యం తాగించి ఎక్కువ మొత్తంలో బిల్లుల రూపంలో వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. దిల్లీ, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో ప్రవేశించి రూ.30లక్షలు దండుకున్న ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులతోపాటు పబ్‌ నిర్వాహకులు నలుగురు మొత్తం పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు కార్లు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  బుధవారం మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ జి.వినీత్, ఏసీపీ శ్రీకాంత్, ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ వివరాలు వెల్లడించారు. దిల్లీకి చెందిన అక్షయ్‌కుమార్‌(27), సూరజ్‌కుమార్‌(23), అక్షత్‌నరుల(23), తురణ్‌(30), శివరాజ్‌నాయక్‌(27), రోహిత్‌కుమార్‌(19) డెవిల్స్‌ నైట్‌ క్లబ్‌ పేరిట కొంతకాలం దిల్లీలో పబ్‌ నిర్వహించారు. నష్టాలు రావడంతో మూసివేశారు. డబ్బు కోసం సరికొత్త తరహా మోసానికి తెరలేపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని