logo

ఇన్‌స్టాలో స్నేహం.. పెళ్లయ్యాక డ్రగ్స్‌ వ్యాపారం

బెంగళూర్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న భార్యాభర్తలు సయ్యద్‌ ఫైజల్‌ (27), ముషారత్‌ ఉన్నీసాబేగం అలియాస్‌ నదియా(27)తోపాటు జునైద్‌ఖాన్‌(29), మహ్మద్‌ అబ్రార్‌ ఉద్దీన్‌(28), రహ్మత్‌ఖాన్‌(46)లను తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో(టీజీన్యాబ్‌) పోలీసులు అరెస్టు చేసినట్టు బుధవారం తెలిపారు.

Published : 13 Jun 2024 02:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: బెంగళూర్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న భార్యాభర్తలు సయ్యద్‌ ఫైజల్‌ (27), ముషారత్‌ ఉన్నీసాబేగం అలియాస్‌ నదియా(27)తోపాటు జునైద్‌ఖాన్‌(29), మహ్మద్‌ అబ్రార్‌ ఉద్దీన్‌(28), రహ్మత్‌ఖాన్‌(46)లను తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో(టీజీన్యాబ్‌) పోలీసులు అరెస్టు చేసినట్టు బుధవారం తెలిపారు. వారి నుంచి రూ.4లక్షలు విలువ చేసే 34 గ్రాముల ఎండీఎంఏ, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట్‌కు చెందిన సయ్యద్‌ ఫైజల్‌ కుక్కపిల్లలు విక్రయించేవాడు. ఐదేళ్ల క్రితం ముషీరాబాద్‌లో ఉంటున్న ముషారత్‌ ఉన్నీసా బేగంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లుగా గోవా నుంచి మత్తుపదార్థాలు తీసుకొచ్చి నగరంలోని అమ్ముతున్నారు. బెంగళూరులోని జునైద్‌ఖాన్‌ ద్వారా కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటివి తీసుకొచ్చేవారు. ఎండీఎంఏ గ్రాము రూ.5-6వేలకు కొనుగోలు చేసి రూ.8-10వేలకు విక్రయించేవారు. గతంలో పలుమార్లు అరెస్టయి జైలుకెళ్లొచ్చినా తిరిగి అదే మార్గం ఎంచుకునేవారు. వారం రోజుల క్రితం దంపతులు, మహ్మద్‌ అబ్రార్‌ ఉద్దీన్, రహ్మత్‌ఖాన్‌ బెంగళూరు వెళ్లారు. అక్కడ జునైద్‌ఖాన్‌ వద్ద 34గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశారు. టీజీన్యాబ్‌ పోలీసులు నిఘా ఉంచి ఈ నెల 10న బెంగళూర్‌ నుంచి మత్తుపదార్థాలతో నగరానికి చేరుకున్న వీరిని హసన్‌నగర్‌ క్రాస్‌రోడ్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని