logo

నీరు నిలిస్తే.. ఖర్చు యజమానులదే

వర్షాకాలం మొదలైనందున డెంగీ, మలేరియా, ఇతర వ్యాధుల నుంచి నగరవాసులకు రక్షణ కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు

Updated : 13 Jun 2024 04:59 IST

మాట్లాడుతున్న పొన్నం, చిత్రంలో ఆమ్రాపాలి, విజయలక్షి, శ్రీలతరెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలం మొదలైనందున డెంగీ, మలేరియా, ఇతర వ్యాధుల నుంచి నగరవాసులకు రక్షణ కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఖాళీ ప్లాట్లలోని చెత్త, నీటి నిల్వలను యజమానులు చక్కదిద్దాలని, లేదంటే బల్దియా ఆ పని చేస్తుందని, యజమానులు ఖర్చును భరించాల్సి ఉంటుందన్నారు. వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, నాలాలు, పూడికతీత, వన మహోత్సవం, ఇతరత్రా అంశాలపై నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ ఆమ్రపాలితో కలిసి ఆయన బుధవారం బల్దియా కార్యాలయంలో సమీక్ష చేపట్టారు.

వర్షాలు, వరదల వల్ల చనిపోకూడదని..

వర్షాలు, వరదల వల్ల ఎవరూ చనిపోకూడదని, ఆ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు. కుండపోత వానలు పడితే నగరవ్యాప్తంగా 141 ప్రాంతాల్లో తరచుగా నీరు నిలుస్తున్నట్లు గుర్తించాం. అక్కడ దిద్దుబాటు చర్యలను చేపడతామన్నారు. రోడ్లపై ముంపు నివారణే లక్ష్యంగా 12 చోట్ల సంపులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంటి నుంచి చెత్త సేకరించడం మొదలు డంపింగ్‌ యార్డు చేరే వరకు సవివర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామని మంత్రి పొన్నం తెలిపారు. సమీక్ష సందర్భంగా ఆయన పలువురు ఉన్నతాధికారుల తీరుపై, వేర్వేరు విభాగాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని మేయర్‌ విజయలక్ష్మి హెచ్చరించారు. ఉప మేయర్‌ శ్రీలతరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని