logo

ప్రభుత్వ స్థలం పరిశీలన

బషీరాబాద్‌ మండల కేంద్రంలోని జీవన్గీ రోడ్డు మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని గురువారం తహసీల్దార్‌ వెంకటేష్, సహకార సంఘం ఉపాధ్యక్షులు అజయ్‌ ప్రసాద్‌ పరిశీలించారు.

Published : 14 Jun 2024 01:54 IST

వివరాలు తెలుసుకుంటున్న తహసీల్దార్‌ వెంకటేష్, అజయ్‌ ప్రసాద్‌ 

బషీరాబాద్, న్యూస్‌టుడే: బషీరాబాద్‌ మండల కేంద్రంలోని జీవన్గీ రోడ్డు మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని గురువారం తహసీల్దార్‌ వెంకటేష్, సహకార సంఘం ఉపాధ్యక్షులు అజయ్‌ ప్రసాద్‌ పరిశీలించారు. ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, ఆర్డీవో ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అక్కడ అత్యంత నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. గోసాయి కాలనీలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని గతంలో కేటాయించారని వివరించారు. ఇదే స్థలంలో భూమిని చదును చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం సహకార సంఘం గోదాం నిర్మాణం జరుగుతున్న స్థలంలో అదనంగా మరో ఎకరా భూమిని కేటాయించాలన్న సంఘం విన్నపం మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తహసీల్దార్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రాకేష్, సిబ్బంది ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని