logo

మీసేవ కేంద్రంలో అదనపు వసూళ్లు

నిర్దేశిత ఛార్జీలకు బదులు అదనంగా డబ్బులు వసూలు చేసిన మీసేవా కేంద్రానికి హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది.

Published : 14 Jun 2024 02:02 IST

జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిర్దేశిత ఛార్జీలకు బదులు అదనంగా డబ్బులు వసూలు చేసిన మీసేవా కేంద్రానికి హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. వినియోగదారుడి నుంచి అదనంగా వసూలు చేసిన రూ.50 తిరిగి ఇవ్వడంతో పాటు రూ.1,000 పరిహారం, రూ.500 కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. యూసుఫ్‌గూడకు చెందిన పి.నరేశ్‌ కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో ఉండే సాయి నందిని సర్వీసెస్‌ (మీ సేవా కేంద్రం)కి వెళ్లి ద్విచక్ర వాహనం ఆర్సీ ట్రాన్స్‌ఫర్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేయాలని కోరారు. నిర్దేశిత ఛార్జీల ప్రకారం రూ.585, యూజర్‌ ఛార్జీలు రూ.35 కలిపి మొత్తం రూ.620 అయింది. కానీ మీసేవా కేంద్రం నిర్వాహకులు రూ.670 వసూలు చేశారు. ఇదేమిటని అడిగితే ప్రింటవుట్‌ల కోసం అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో నరేశ్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని