logo

కిన్నెర మొగిలయ్యకు మంత్రి పొన్నం సన్మానం

పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళాకారుడు కిన్నెర మొగిలయ్య రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 14 Jun 2024 02:03 IST

హైదరాబాద్, న్యూస్‌టుడే: పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళాకారుడు కిన్నెర మొగిలయ్య రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కలిసిన మొగిలయ్యను మంత్రి శాలువా కప్పి సత్కరించారు. మొగిలయ్య ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

దిల్లీలో లాల్‌దర్వాజా బోనాలకు ఏర్పాట్లు చేయండి.. 

దేశ రాజధాని దిల్లీలో లాల్‌ దర్వాజా బోనాలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లాల్‌ దర్వాజా సింహవాహని శ్రీమహంకాళి దేవాలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. గురువారం కమిటీ ఛైర్మన్‌ సి.రాజేందర్‌ యాదవ్, కన్వీనర్‌ జి.అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ మంత్రిని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్లు కె.వెంకటేశ్, సి.బంగ్లా రాజు యాదవ్, సి.వెంకటేశ్, రాజ్‌కుమార్‌ యాదవ్, జే.లక్ష్మీనారాయణ గౌడ్, కమిటీ ప్రతినిధులు వినోద్‌కుమార్, విట్టల్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని