logo

అంతర్జాతీయ పురస్కారానికి అమృతవల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాశ్‌ సినర్జీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఎ.వి.ఎస్‌.డి.అమృతవల్లి అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు ‘మన సంస్కృతి’ సంస్థ (హైదరాబాద్‌) పరీక్ష సంచాలకుడు డా.అనిల్‌కుమార్‌ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 14 Jun 2024 02:05 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాశ్‌ సినర్జీ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ఎ.వి.ఎస్‌.డి.అమృతవల్లి అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు ‘మన సంస్కృతి’ సంస్థ (హైదరాబాద్‌) పరీక్ష సంచాలకుడు డా.అనిల్‌కుమార్‌ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. తమ సంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలో ఆమె వరుసగా ఆరుసార్లు విజేతగా నిలిచినట్లు ఆయన పేర్కొన్నారు. మాతృభాషలో ఆమె కనబరుస్తున్న అత్యుత్తమ ప్రతిభను మలేసియాలోని యునైటెడ్‌ హెరిటేజ్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ సంస్థ గుర్తించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని