logo

ఎర్రమంజిల్‌ ప్రభుత్వ పాఠశాలకు నూతన భవన నిర్మాణం

నిమ్స్‌ విస్తరణ పనుల్లో భాగంగా ఎర్రమంజిల్‌ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నూతన భవనం నిర్మించే వరకు కూల్చవద్దంటూ పాఠశాల పూర్వ విద్యార్థుల డిమాండ్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు.

Updated : 14 Jun 2024 05:09 IST

ఎర్రమంజిల్‌ ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణ
నమూనాను చూపుతున్న దానం నాగేందర్, ప్రొ.కోదండరాం, విజయారెడ్డి తదితరులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: నిమ్స్‌ విస్తరణ పనుల్లో భాగంగా ఎర్రమంజిల్‌ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నూతన భవనం నిర్మించే వరకు కూల్చవద్దంటూ పాఠశాల పూర్వ విద్యార్థుల డిమాండ్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. గురువారం పాఠశాల ప్రాంగణాన్ని ఫ్రొ.కోదండరాం, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్‌ విజయారెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్‌సీ గణపతిపతిరెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొ.బీరప్ప, జాతీయ బాలల హక్కుల కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ శాంతా సిన్హా తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, లలితాశ్రీ ఇతర ప్రతినిధులు పాత భవనం కూల్చొదంటూ విజ్ఞప్తి చేశారు. దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. నిమ్స్‌ విస్తరణ కోసం ప్రభుత్వ పాఠశాల భవనం అప్పగించినప్పటికీ ఆర్‌అండ్‌బీ హామీ మేరకు కొత్త పాఠశాల భవనం నిర్మించాల్సిందేన్నారు. కొత్త భవనం నిర్మాణం తర్వాతే పాత భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. · ముఖ్యమంత్రిని కలిసి సమస్య వివరిస్తానని, దసరాలోపు కొత్త భవనం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాలాపురా బస్తీ నుంచి రాకపోకలు సాగించే విద్యార్థులకు రహదారి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని