logo

ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు

ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు సాధించవచ్చని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి అన్నారు. గోపన్‌పల్లి జవహర్‌ నవోదయ విద్యాలయంలో గురువారం ఆయన నవోదయ విద్యాలయాల విద్యార్థుల పారా స్పోర్ట్స్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

Updated : 14 Jun 2024 05:08 IST

సైబరాబాద్‌ సీసీ అవినాశ్‌ మహంతి

థాయ్‌లాండ్‌తోపాటు ఇతర దేశాల్లో పతకాలు సాధించిన దివ్యాంగ క్రీడాకారులతో
సైబరాబాద్‌ సీపీ అవినాష్‌. నటి రెజీనా, డిప్యూటీ కమిషనర్‌ గోపాలకృష్ణ

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఆత్మస్థైర్యంతో ముందడుగేస్తే విజయాలు సాధించవచ్చని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి అన్నారు. గోపన్‌పల్లి జవహర్‌ నవోదయ విద్యాలయంలో గురువారం ఆయన నవోదయ విద్యాలయాల విద్యార్థుల పారా స్పోర్ట్స్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరిలోనూ పారాక్రీడాకారుల విజయాలు స్ఫూర్తిని నింపుతాయని చెప్పారు. పారా క్రీడాకారుల్లో అపార ప్రతిభ దాగుంటుందని, శిక్షణ శిబిరాలు ప్రతిభను సానపెట్టడంలో కీలకంగా నిలుస్తాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించేందుకు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సినీ నటి రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. శిక్షణలో మెలకువలు నేర్చుకొని మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. పారా క్రీడాకారులు అనేక అడ్డంకులు, కష్టాల కోర్చి రాణించి ప్రతిఒక్కరిలో ఆశావహ దృక్పథాన్ని నింపుతారని చెప్పారు. పారాలింపిక్స్‌కు ఎంపికైన తొలి అథ్లెట్లు జ్యోతి, అర్షద్‌లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని