logo

సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఆదరణ

సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ అన్నారు. బ్లిడ్జ్‌ ఎగ్జిబిషన్, తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (టీఎఫ్‌పీఎస్‌) సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్‌ హైటెక్స్‌లో మూడు రోజుల ‘ఫుడ్‌ ఎ ఫెయిర్‌’ (ఆహార ఉత్పత్తుల ప్రదర్శన)ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్రంభించారు.

Published : 14 Jun 2024 02:09 IST

హైటెక్స్‌లో ఫుడ్‌ ఎ ఫెయిర్‌ ప్రారంభించిన గోపిచంద్‌

వివిధ దేశాల జాతీయ పతాకాలను తిలకిస్తున్న పుల్లెల గోపీచంద్‌. చిత్రంలో విశాల, అఖిల్‌ గౌవర్, శ్రీకాంత్‌ 

రాయదుర్గం, న్యూస్‌టుడే: సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ అన్నారు. బ్లిడ్జ్‌ ఎగ్జిబిషన్, తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ (టీఎఫ్‌పీఎస్‌) సంయుక్త ఆధ్వర్యంలో మాదాపూర్‌ హైటెక్స్‌లో మూడు రోజుల ‘ఫుడ్‌ ఎ ఫెయిర్‌’ (ఆహార ఉత్పత్తుల ప్రదర్శన)ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్రంభించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారత ఆహార ఉత్పత్తుల్లో ప్రత్యేకతలు ఉంటాయని చెప్పారు. ప్రదర్శనలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడ[ంలో దోహదం చేస్తాయన్నారు. బ్లిడ్జ్‌ ఎగ్జిబిషన్స్‌ వ్యవస్థాపకులు విశాల, శ్రీకాంత్‌ పునాటి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారత ఆహార ఉత్పత్తిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇందులో 56 స్టాల్స్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. ఆహార ఉత్పత్తుల వ్యాపారరంగంలోని వారికి ఈ ప్రదర్శన వ్యాపార విస్తరణ, తమ ఉత్పత్తుల విక్రయాలకు ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. శనివారం వరకు ప్రదర్శన కొనసాగుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని