logo

కిషన్‌రెడ్డిపైనే నగర వాసుల ఆశలన్నీ..!

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలిచిన కిషన్‌రెడ్డి అందరూ ఊహించిన విధంగానే  కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక నగర ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

Published : 14 Jun 2024 02:12 IST

రీజనల్‌ రింగు రైలు పట్టాలెక్కించాలి
ఎంఎంటీఎస్, మెట్రోలకు నిధులు అవసరం

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలిచిన కిషన్‌రెడ్డి అందరూ ఊహించిన విధంగానే  కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇక నగర ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

  • దాదాపు రూ.26 వేల కోట్లతో జంట నగరాలకు 350 కిలోమీటర్ల మేర రీజనల్‌ రింగు రోడ్డు నిర్మాణానికి నిధులు కొంతమేర అందినా.. ఈ ఐదేళ్లలో మొత్తం మంజూరయ్యేలా చూసి రీజనల్‌ రింగురోడ్డు, రింగురైలు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిఉంది.
  • యాదాద్రి, భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను కలుపుతూ ట్రిపుల్‌ఆర్‌ నిర్మాణం జరిగితే నగరం రూపురేఖలే మారిపోతాయి.
  • రూ.430 కోట్లతో చేపట్టిన చర్లపల్లి శాటిలైట్‌ రైల్వే స్టేషన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి.
  • రూ.720 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణ పనులకు నిధులు కొరత లేకుండా.. 2025కల్లా పూర్తి చేయాలి.
  • ఎంఎంటీఎస్‌ రెండోదశ పూర్తిలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కొత్త రైళ్లు కొనేందుకు నిధులందించి పూర్తి స్థాయిలో వాటిని పరుగులు పెట్టించాలి.
  • జంటనగరాల ప్రజలు యాదాద్రిని సులభంగా సందర్శించుకునేలా ఎంఎంటీఎస్‌ రెండో దశ విస్తరణకు రూ. 350 కోట్లు కేటాయింపులు జరిగేలా చూడాలి.
  • రూ.602 కోట్లతో హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. రూ.22.57 కోట్లతో బేగంపేట స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తి చేయాల్సిఉంది.
  • నగరంలో ఎంఎంటీఎస్‌ స్టేషన్లు కూడా అభివృద్ధి ప్రణాళికలో ఉన్నాయి. హైటెక్‌సిటీ, మలక్‌పేట, ఉందానగర్, అఫీజ్‌పేట స్టేషన్లలో అభివృద్ధికి దాదాపు రూ.370 కోట్లు వచ్చేలాచూసి.. ఆ పనులను పూర్తి చేయాల్సిఉంది.
  • అంబర్‌పేట ప్రజల ట్రాఫిక్‌ కష్టాలు తీరడానికి శాశ్వత పరిష్కార దిశగా అంబర్‌పేట క్రాస్‌రోడ్సు వద్ద జాతీయ రహదారి 202పై రూ.266 కోట్లతో 4లేన్ల పైవంతెన నిర్మాణం పూర్తికి చర్యలు తీసుకోవాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని