logo

16 కేసులు.. 10 మారుపేర్లు

హైటెక్‌ విధానంలో వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేసి.. ఆరుగురు యువతులను రక్షించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులున్నాయి.

Published : 14 Jun 2024 02:22 IST

ఉద్యోగాల పేరుతో యువతులకు మహిళ వల
హైటెక్‌ వ్యభిచారం గుట్టురట్టు

ఈనాడు- హైదరాబాద్, పంజాగుట్ట, న్యూస్‌టుడే: హైటెక్‌ విధానంలో వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిర్వాహకులు, ఒక విటుడిని అరెస్టు చేసి.. ఆరుగురు యువతులను రక్షించారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలిపై గతంలో 16 కేసులున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఆమెకు 10 మారుపేర్లు.. విజయవాడకు చెందిన కె.సూర్యకుమారి(38) ఈ వ్యభిచార ముఠాకు ప్రధాన సూత్రధారి. పది మారుపేర్లతో చలామణి అవుతున్న ఆమె నగరంలోని మధురానగర్‌లో ఉంటోంది. తిరుపతికి చెందిన కె.విజయశేఖర్‌రెడ్డి(49) అక్కడే ఉండేవాడు. ఇద్దరూ నగరంలో వ్యభిచార గృహాలు నిర్వహించేవారు. 2020లో పీడీయాక్టు కింద జైలుకు పంపినా తీరు మారలేదు.

ఆశ చూపుతూ.. సూర్యకుమారి, విజయ శేఖర్‌రెడ్డి ఏపీ, పశ్చిమబెంగాల్, త్రిపుర తదితర రాష్ట్రాల తదితర రాష్ట్రాలకు చెందిన యువతులకు డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి నగరానికి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దింపుతారు. శేఖర్‌రెడ్డి కస్టమర్ల డేటాను ఒక యాప్‌లో ఉంచుతాడు.  దాని ఆధారంగా కస్టమర్లు చెప్పిన ప్రాంతాలు, హోటళ్లకు యువతులను తీసుకెళ్తారు. సూర్యకుమారి కస్టమర్ల నుంచి క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా డబ్బు తీసుకుంటోంది. గురువారం పంజాగుట్ట ఠాణా పరిధిలోని పార్క్‌ హోటల్‌లో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోదా చేయగా గండిపేటకు చెందిన కిలారు కీర్తితేజ(29), ఓ యువతి పట్టుబడ్డారు. వీరిచ్చిన సమాచారంతో వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీచేసి సూర్యకుమారి, శేఖర్‌రెడ్డి, వారికి సహకరిస్తున్న పశ్చిమబెంగాల్‌ వాసి అర్కోజిత్‌ ముఖర్జీ(30), తిరుపతికి చెందిన వేణుగోపాల్‌ బాలాజీ(50)ని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని