logo

గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగొద్దు

వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ కంపెనీ కియోలిస్, స్వతంత్ర ఇంజినీర్‌ ఏఈకామ్‌ సీనియర్‌ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

Updated : 14 Jun 2024 12:33 IST

సమావేశంలో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, కేవీబీ రెడ్డి,
కియోలిస్‌ ఎండీ మిశ్రా, మెట్రో అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ కంపెనీ కియోలిస్, స్వతంత్ర ఇంజినీర్‌ ఏఈకామ్‌ సీనియర్‌ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

వానాకాలంలో ముందస్తుగా చేపట్టాల్సినవి..

  • భారీ వర్షాలు, ఈదురుగాలులకు రైలు సేవలకు అంతరాయం కలగకుండా చూడాలి. ట్రాన్స్‌కో ఫీడర్‌ ట్రిప్‌ అయితే తక్షణమే ప్రత్యామ్నాయ ఫీడర్‌లకు మార్చడానికి ఏర్పాట్లు చేయాలి.
  • జాయింట్లను తనిఖీ చేయడం, సీల్‌ వేయడం, వర్షపునీటి పైపులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, లీకులను నివారించడం, వయాడక్ట్‌లపై పెరిగిన మొక్కలను తొలగించాలి. 
  • విద్యుత్తు ట్రాక్షన్‌ లైన్లపై పడే వస్తువులను తొలగించాలి.
  • మెట్రో రైలు వ్యవస్థలపై పడే సమీపంలోని ప్రకటనల బోర్డుల ఫ్లెక్సీలను తొలగించాలి.
  • మెట్రో ప్రవేశ మార్గాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల వద్ద ముంపు లేకుండా చూడాలి.
  • ఇటీవల దిల్లీ మెట్రో రైలులో ఒక మహిళ తన చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోయి ఆమె మరణానికి దారితీసిందని తెలిపారు. తలుపుల వద్ద రద్దీని నివారించాలని సూచించారు. ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి, కియోలిస్‌ ఎండీ ఎస్‌సీ మిశ్రా పాల్గొన్నారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని