logo

నగరాన చినుకులు

మలక్‌పేట, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. మలక్‌పేట్‌ న్యూ మార్కెట్లోకి మోకాలు లోతున వరద చేరింది. ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున వరద ప్రవహించింది.

Updated : 14 Jun 2024 04:58 IST

జారిపడుతున్న వ్యక్తిని రక్షిస్తున్న సిబ్బంది 

ఈనాడు, హైదరాబాద్‌: మలక్‌పేట, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో గురువారం కుండపోత వర్షం కురిసింది. మలక్‌పేట్‌ న్యూ మార్కెట్లోకి మోకాలు లోతున వరద చేరింది. ప్రధాన రహదారుల్లో పెద్ద ఎత్తున వరద ప్రవహించింది. సంతోశ్‌ నగర్, ఐఎస్‌సదన్‌ రోడ్లు చెరువుల్లా మారాయి. ఆయా ప్రాంతాల్లోని డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. నీరు నిలిచిన చోట మ్యాన్‌హోళ్లను చక్కదిద్ది వరదను దారి మళ్లించినట్లు జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. రాత్రి 9 గంటల వరకు కూర్మగూడలో గరిష్ఠంగా 4.1 సెం.మీ వర్షపాతం నమోదవగా, డబీర్‌పురలో 3.98, చార్మినార్‌ వద్ద 3.35, సైదాబాద్‌లో 3.28, చంపాపేట్‌లో 2.23, విరాఠ్‌నగర్‌లో 2.2 సెం.మీ కురిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని