logo

కవలలు.. చూసుకునేందుకు గొడవలు

పిల్లల సంరక్షణ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఓ తల్లి తన కవల పిల్లలను చెరువులో పడేసి ఆత్మహత్యకు యత్నించింది.

Updated : 14 Jun 2024 05:04 IST

పిల్లల్ని చెరువులో పడేసిన తల్లి.. బాలుడి మృతి

శ్రీహాన్స్‌ 

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పిల్లల సంరక్షణ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో ఓ తల్లి తన కవల పిల్లలను చెరువులో పడేసి ఆత్మహత్యకు యత్నించింది. బాలుడు మృతి చెందగా.. తల్లీకుమార్తె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అమీన్‌పూర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌లో ఉంటున్న దంపతులు శ్వేత, విద్యాధర్‌రెడ్డి ఐటీ నిపుణులు. వీరికి కవల పిల్లలను చూసుకునే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం భర్త కార్యాలయం పనిపై వరంగల్‌కు వెళ్లారు. శ్వేత తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో చందానగర్‌ నుంచి మూడేళ్ల ఇద్దరు పిల్లలు శ్రీహ, శ్రీహాన్స్‌ను బైక్‌పై తీసుకొని అమీన్‌పూర్‌ సాయిబాబా ఆలయం సమీపం చెరువు గట్టు వద్దకు వచ్చింది. ముందు బాలుడు శ్రీహాన్‌ను చెరువులోకి విసిరేసి తరువాత కుమార్తె శ్రీహాను విసిరేసి శ్వేత చెరువులోకి దూకింది. ఆ సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ జానకీరామ్, కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ గమనించి శ్వేత, కుమార్తె శ్రీహాను వెలికితీశారు. సపర్యలు అనంతరం శ్వేత తన బాబు చెరువులో ఉన్నట్టు తెలిపింది. ఉదయం మృతదేహం తేలింది. కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు