logo

డా.శుభాకర్‌కు ఎఫ్‌ఆర్‌సీపీ పురస్కారం

వైద్య రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డా. కె.శుభాకర్‌ శుక్రవారం ఈడెన్‌బర్గ్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ నుంచి అరుదైన ఎఫ్‌ఆర్‌సీపీ పురస్కారాన్ని అందుకున్నారు.

Published : 15 Jun 2024 04:09 IST

 

అమీర్‌పేట, న్యూస్‌టుడే: వైద్య రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ డా. కె.శుభాకర్‌ శుక్రవారం ఈడెన్‌బర్గ్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ నుంచి అరుదైన ఎఫ్‌ఆర్‌సీపీ పురస్కారాన్ని అందుకున్నారు. 2022లో కూడా ఈయన లండన్‌లోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ నుంచి ఎఫ్‌ఆర్‌సీపీ పురస్కారాన్ని అందుకున్నారు. శ్వాసకోశ వ్యాధుల నిపుణులైన డా.శుభాకర్‌ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా, జాతీయ క్షయ నియంత్రణ కార్యక్రమ జోనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌గా, ఆఫ్రికాలో ప్రకంపనలు సృష్టించిన ఎబోలా వైరస్‌ నియత్రణకు తెలంగాణ రాష్ట్రంలో సమన్వయకర్తగా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, స్వైన్‌ఫ్లూ మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ సమన్వయకర్తగా పనిచేశారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ చెస్ట్‌ ఫిజీషియన్స్‌ సంస్థ తరఫున ఛాతీ వైద్యుల అంతర్జాతీయ గవర్నింగ్‌ కౌన్సిల్‌కు వైస్‌ ఛైర్మన్‌గా, ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంహెచ్‌) హైదరాబాద్‌ నార్త్‌కు అధ్యక్షుడు, కార్యదర్శిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు