logo

కాలువలు పూడ్చిన వారిపై క్రిమినల్‌ కేసులు

చంద్రవంచ శివారులో దశాబ్దాలుగా కాగ్నా నదికి అనుసంధానంగా ఉన్న పరీవాహక కాలువలను పూడ్చివేసిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేస్తామని తాండూరు తహసీల్దారు కేతావత్‌ తారాసింగ్‌ వెల్లడించారు.

Published : 15 Jun 2024 04:14 IST

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: చంద్రవంచ శివారులో దశాబ్దాలుగా కాగ్నా నదికి అనుసంధానంగా ఉన్న పరీవాహక కాలువలను పూడ్చివేసిన వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేస్తామని తాండూరు తహసీల్దారు కేతావత్‌ తారాసింగ్‌ వెల్లడించారు. ‘ఈనాడు’లో ‘కాగ్నా పరీవాహక కాలువల పూడ్చివేత’ శీర్షికన గతనెల 26న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గిర్దావర్‌ బాలరాజుతో కలిసి తహసీల్దార్‌ శుక్రవారం చంద్రవంచకు వెళ్లి పూడ్చివేసిన కాలువలను పరిశీలించారు. వర్షాకాలంలో వరదను ఒడిసిపట్టేందుకు వాటర్‌షెడ్‌ నిధులతో నిర్మించిన ఆనకట్టలను కనుమరుగు చేసినట్లు గుర్తించారు. భారీ వర్షాలకు కాల్వ నిండి పక్కనున్న పంట పొలాలు ముంపునకు గురై నష్టపోవాల్సి వస్తుందని పరిసరాల రైతులు తహసీల్దారుకు మొరపెట్టుకున్నారు. కాలువలను పునరుద్ధరింపజేయాలని, ప్రమాదకరంగా తవ్విన కాలువను పూడ్చివేయించాలని వేడుకున్నారు. కొత్తగా కాలువ తవ్విన వారిపై క్రిమినల్‌ కేసు నమోదుకు ఆదేశిస్తామని తహసీల్దార్‌ వెల్లడించారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని