logo

హైదరాబాద్‌ విద్యార్ధికే ఐసెట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీఐసెట్‌)లో మొదటి ర్యాంక్‌ హైదరాబాద్‌ విద్యార్ధినే వరించింది.

Published : 15 Jun 2024 04:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీజీఐసెట్‌)లో మొదటి ర్యాంక్‌ హైదరాబాద్‌ విద్యార్ధినే వరించింది. టాప్‌టెన్‌లో నాలుగు స్థానాల్లో నగరానికి చెందిన వారే సత్తాచాటారు. అత్తాపూర్‌ హీరానగర్‌ కాలనీకు చెందిన సయ్యద్‌ మునీబుల్లా హుస్సేని 153.53500 మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచాడు. మాడుగుల సుద్దపల్లెకు చెందిన జెల్లా భరత్‌ 152.79795 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. మల్కాజగిరి వెంకటేశ్వరనగర్‌కాలనీకి చెందిన కందల లాస్య(150.72933) 3వ ర్యాంక్,  కాప్రా సైనికపురి సాధన విహారన కాలనీకి చెందిన బి.అక్షిత్‌(142.59153), కార్ఖానా విద్యార్థిని గంగా షిండే(142.14644) 8 ర్యాంక్, శంకరంపల్లి మిర్జాగూడ విద్యార్ధి ఎన్‌.అరుణ్‌సింగ్‌ (141.83559) 9వ ర్యాంక్‌ కైవసం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని