logo

27 నుంచి రామకృష్ణ మఠంలో ‘శౌర్య క్యాంప్‌’

యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా దోమలగూడలోని రామకృష్ణ మఠంలో.. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ‘శౌర్య’ పేరిట శిబిరం నిర్వహిస్తున్నట్లు మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి తెలిపారు.

Published : 15 Jun 2024 04:23 IST

రాంనగర్‌: యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా దోమలగూడలోని రామకృష్ణ మఠంలో.. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ‘శౌర్య’ పేరిట శిబిరం నిర్వహిస్తున్నట్లు మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లు ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సంబంధిత కార్యక్రమంలో స్వామి వివేకానంద సందేశంపై ప్రత్యేక తరగతులతో పాటు యువతలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా శిక్షణ ఇస్తామని తెలిపారు. బృంద చర్చలతో పాటు ప్రశ్న-జవాబుల సెషన్‌ కూడా ఉంటుందన్నారు. యోగా, ధ్యానం, భక్తి సంగీతంపైనా ప్రత్యేక తరగతులు ఉంటాయన్నారు. వివరాలకు ఫోన్‌ 91772 32696.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని