logo

తెలుగు వైతాళికుడు రామోజీరావు

రామోజీరావు అక్షరశిల్పి అని సీనియర్‌ పాత్రికేయుడు, హాస్యావధాని శంకరనారాయణ నివాళులర్పించారు. ఆయన  తెలుగు వైతాళికుడని కొనియాడారు.

Updated : 15 Jun 2024 05:08 IST

సంతాప సభల్లో పలువురి నివాళి

రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేస్తున్న మామిడి సోమయ్య. చిత్రంలో బసవ పున్నయ్య, నాగవాణి, శంకరనారాయణ, జగదీశ్, ఆనందం

గాంధీనగర్, ముషీరాబాద్, బాగ్‌లింగంపల్లి : రామోజీరావు అక్షరశిల్పి అని సీనియర్‌ పాత్రికేయుడు, హాస్యావధాని శంకరనారాయణ నివాళులర్పించారు. ఆయన  తెలుగు వైతాళికుడని కొనియాడారు.  టీడబ్ల్యూజేఎఫ్, ఐఎఫ్‌డబ్ల్యూజే,హెచ్‌యూజేల సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభలో జరిగిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంతాపసభలో శంకరనారాయణ పాల్గొన్నారు. టీడబ్ల్యూజేఎఫ్‌ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ  ‘ఈనాడు’తోనే పాత్రికేయులకు గుర్తింపు, గౌరవం దక్కాయన్నారు. ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి ఆనందం మాట్లాడుతూ  పత్రికారంగంలోరామోజీరావు విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఉత్తమ జర్నలిస్టులకు రామోజీరావు స్మారక అవార్డులను ఏటా ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు.హెచ్‌యూజే కార్యదర్శి జగదీశ్‌ మాట్లాడుతూ, రామోజీరావు మరణం మీడియారంగానికి తీరనిలోటన్నారు.హెచ్‌యూజే ఉపాధ్యక్షురాలు నాగవాణి, సీనియర్‌ పాత్రికేయుడు చంద్రశేఖర్, ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్‌ అంజిరెడ్డి, వెంకటేష్, రాయప్రోలు రమణ, టి.శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పాత్రికేయ దిగ్గజం..

నివాళులర్పిస్తున్న జ్యోతి, మణి, సరస్వతి, విజయలక్ష్మి, భూపతి వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, రాములు, మహేశ్‌దుర్గే

బాగ్‌లింగంపల్లి: ‘ఈనాడు’ దిన పత్రిక ద్వారా తన జీవితాంతం ప్రజా చైతన్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన  పాత్రికేయ దిగ్గజం రామోజీరావు అని వక్తలు కొనియాడారు. శుక్రవారం సుందరయ్య కళానిలయంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్స్‌ యునైటెడ్‌ ఫోరం రాష్ట్ర సంఘాల సంయుక్తాధ్వర్యంలో రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. యునైటెడ్‌ ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మంచాల వెంకటస్వామి రామోజీరావుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రాన్ని  కోరారు.  రచయిత భూపతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని