logo

తాజా..తాజాగా..

రైతులు పండించిన కూరగాయలు, పండ్లు మరింత తాజాగా వినియోగదారులకు అందనున్నాయి.

Published : 15 Jun 2024 04:30 IST

కూరగాయలు, పండ్ల ప్రాసెసింగ్‌
వృథాను అరికట్టేందుకు మేడ్చల్‌లో ప్రత్యేక విభాగం

పండ్లను శుభ్రం చేసే యంత్రం

ఈనాడు, హైదరాబాద్, మేడ్చల్‌ రూరల్, న్యూస్‌టుడే: రైతులు పండించిన కూరగాయలు, పండ్లు మరింత తాజాగా వినియోగదారులకు అందనున్నాయి. తొందరగా పాడవకుండా  ఉంటాయి.  వీటి ఉత్పత్తుల నాణ్యత, పరిమాణం ఆధారంగా గ్రేడింగ్, ప్యాకింగ్‌ చేసి సూపర్‌ మార్కెట్లకు విక్రయించనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడు నగరానికి చేరువలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మేడ్చల్‌లోని ఆదర్శ రైతుసేవా సహకార సంఘం పూడూరులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాయి.

ఏర్పాటు ఇలా: కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా మంత్రిత్వ శాఖ అధికారులు, ఆదర్శ రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు రూ.4.70కోట్ల వ్యయంతో ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను  అందుబాటులోకి తీసుకురానున్నారు.

పండ్లు, కూరగాయల ముక్కలు: మేడ్చల్‌ జిల్లాలో నెలకు సుమారు 190 టన్నుల కూరగాయలు, పండ్లు వ్యర్థమవుతున్నట్లు అంచనా. ఇలా కాకుండా బోయిన్‌పల్లి మార్కెట్, ఒంటిమామిడిలోని కూరగాయల మార్కెట్లలో ధరలు పడిపోయినప్పుడు వాటిని నేరుగా ఈ క్లస్టర్‌కు తరలించి ఉప ఉత్పత్తులుగా మార్చడం ఈ విభాగం ప్రధాన లక్ష్యం. పండ్లు, కూరగాయలను ముక్కలుగా చేసి ఊరగాయలుగా చేయడంతో పాటు బంగాళా దుంపలను చిప్స్‌గా మార్చడం, సాస్‌లు, ప్యూరీ పౌడర్‌ చేస్తారు. ఇలా చేయడంతో రైతులకు ఆదాయం కూడా పెరుగుతుంది.

నిర్వహణ ఇలా: పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్వహణ బాధ్యతను పూడూరు ఆదర్శ రైతు సేవా సంఘానికి అప్పగించనున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం, పరికరాల ఏర్పాటును జిల్లా ఉద్యానశాఖ పర్యవేక్షిస్తున్నప్పటికీ అధికార బాధ్యతలను సొసైటీకి ఇచ్చి సంఘం అర్థికంగా బలోపేతమయ్యేలా తోడ్పాటు అందిస్తోంది. యూనిట్‌లో రోజుకు 10టన్నుల పండ్లు, కూరగాయలు శుభ్రం చేసే సామర్థ్యం ఉంది. రోజుకు 50కిలోల చొప్పున ఊరగాయ పచ్చడి, మిరపకాయ, పసుపు పొడి చేసే యంత్రాలు,  పాడైపోయిన పండ్లు, కూరగాయలను గుర్తించడంతో పాటు గ్రేడింగ్‌ చేసే యంత్రాలు ఇందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని