logo

నేటి నుంచి డయల్‌ యువర్‌ ఎండీ

జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Published : 15 Jun 2024 04:39 IST

కొవిడ్‌తో ఆగిన కార్యక్రమం పునఃప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు సమస్యలను తెలుసుకుంటామన్నారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ఇతర సమస్యలపై 040-23442881, 23442882, 23442883 నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రజావాణి పునరుద్ధరణ: ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఓఅండ్‌ఎం డివిజన్లలో డీజీఎం కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి ఉంటుందన్నారు. లోతైన మ్యాన్‌హోళ్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు ప్రతి డివిజన్‌లో 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూం ప్రారంభించామని చెప్పారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే రంగంలోకి దిగేలా 16 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జలమండలి పరిధిలో పెద్ద, చిన్నవి కలిపి 225 ఎయిర్‌టెక్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జలమండలికి సంబంధించిన సమస్యలపై పౌరులు 155313కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని