logo

చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో డయాలసిస్‌ కేంద్రంలో మంటలు సంభవించాయి.

Updated : 16 Jun 2024 05:11 IST

షార్ట్‌ సర్క్యూట్‌తో డయాలసిస్‌ కేంద్రంలో మంటలు

ప్రభుత్వ ఆసుపత్రి బయట రోగులు

చేవెళ్ల, న్యూస్‌టుడే: చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌తో డయాలసిస్‌ కేంద్రంలో మంటలు సంభవించాయి. హఠాత్పరిణామంతో ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అందరూ బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సాయంత్రం డయాలసిస్‌ కేంద్రానికి తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 7:30 గంటలకు అందులో నుంచి ఒక్కసారిగా మంటలు, పొగ రావడం చూసి ఆసుపత్రిలో ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు. పక్క వార్డుల్లో ఉన్న రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని