logo

న్యాయవాదుల సహకార సంఘం సేవలు అభినందనీయం

ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి అన్నారు.

Published : 16 Jun 2024 02:41 IST

మాట్లాడుతున్న జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి

నాగోలు, రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి అన్నారు. న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నాగోలులోని ఓ వేడుకల మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. న్యాయవాదులకు సంఘం ఆర్థిక తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు.  హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మాధవీదేవి, జస్టిస్‌ కె.సురేందర్, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాస్‌రెడ్డి సంఘం సేవలను అభినందించారు.  ప్రతిభ చూపించిన సభ్యుల పిల్లలకు నగదు పురస్కారాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, సిటీ సివిల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలభాస్కర్‌రావు, నాంపల్లి క్రిమినల్‌ కోర్టుల మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సురేశ్, వికారాబాద్‌ జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్‌రెడ్డి, సంఘం అధ్యక్షుడు అనిల్‌కుమార్, కార్యదర్శి రవి, సంచాలకులు బాచిరెడ్డి శాయిరెడ్డి, బుచ్చిబాబు పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని