logo

రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర అమోఘం

భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్‌ రాజన్‌ భట్టాచార్య అన్నారు.

Published : 16 Jun 2024 02:43 IST

రాజ్యసభ సభ్యుడు భట్టాచార్య

మాట్లాడుతున్న బికాస్‌ రాజన్‌ భట్టాచార్య

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్‌ రాజన్‌ భట్టాచార్య అన్నారు. ఐలు రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  రంగారెడ్డి జిల్లా కోర్టులో రాష్ట్ర స్థాయిలో న్యాయవాదులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ తరగతులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుమారు 16,000 మంది సభ్యులు రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌లో ఉండడం సామాన్యమైన విషయం కాదన్నారు.అనంతర ‘రాజ్యాంగ నిర్మాణంలో న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. ‘ఆస్తి బదిలీ చట్టం’ అనే అంశంపై ప్రముఖ న్యాయవాది ఎంవీ దుర్గాప్రసాద్, ‘సివిల్‌ కేసుల డ్రాఫ్టింగ్‌లో అనుసరించాల్సిన నైపుణ్యం’ అనే అంశంపై వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కె.నర్సింహారావు, ‘లీగల్‌ ప్రాక్టీస్‌లో న్యాయవాదులకు ఎదురయ్యే సవాళ్లు’ అనే అంశంపై కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు రమేశ్‌కుమార్‌లు ప్రసంగించారు. ఐలు రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.వనజ, కోశాధికారి ప్రభాకర్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని