logo

శాస్త్రీయ కళల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది

శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో...

Published : 16 Jun 2024 02:45 IST

నర్తకి మాయతో మంత్రి శ్రీధర్‌బాబు, నాదెండ్ల భాస్కరరావు, మామిడి హరికృష్ణ, వైష్ణవిసాయి

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో నాట్యగురువులు డా.రాజేశ్వరి సాయినాథ్, డా.వైష్ణవి సాయినాథ్‌ల పర్యవేక్షణలో యువనర్తకీ ‘మాయ యడ్లపల్లి’ భరతనాట్య సంప్రదాయంలో తొలి ప్రదర్శనిచ్చి మెప్పించింది. పుష్పాంజలితో ప్రదర్శనకు శుభారంభాన్ని పలికిన ఆమె జతిస్వరం, వర్ణం, దేవి స్తుతి వంటి అంశాలను ప్రదర్శించింది. అనంతరం జరిగిన అభినందన సభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఏ రంగంలో ఎదగాలన్నా.. అంకితభావం, కఠోర పరిశ్రమ అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావులతో పాటు మాయా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని