logo

పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు: సినీనటి తాప్సీ

విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.

Updated : 16 Jun 2024 05:03 IST

స్నాతకోత్సవంలో టోపీలను ఎగురవేస్తున్న విద్యార్థులు, చిత్రంలో సినీ నటి తాప్సీ 

బేగంపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాప్సీ మాట్లాడుతూ ఏదైనా సాధిస్తాననే ఆత్మ విశ్వాసం విద్యార్థుల్లో ఉండాలన్నారు. వినయం, విజయం, స్మార్ట్‌వర్క్‌ ప్రతి ఒక్కరి భవిష్యత్తులో ముఖ్యమైన సిద్ధాంతాలు కావాలన్నారు. చదువొక్కటే జీవితానికి కొలమానం కాదని, అన్ని రంగాల్లో రాణించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు. 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని