logo

ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్‌కు ఐఐసీటీ సాంకేతికత బదిలీ

క్షిపణులు, అంతరిక్ష అనువర్తనాల్లో కీలకమైన సీఎల్‌-20 సింథసిస్‌ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్‌లోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది.

Published : 16 Jun 2024 02:58 IST

పత్రాలను చూపుతున్న ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, సంస్థ ఎండీ టి.వి.చౌదరి

ఈనాడు, హైదరాబాద్‌: క్షిపణులు, అంతరిక్ష అనువర్తనాల్లో కీలకమైన సీఎల్‌-20 సింథసిస్‌ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్‌లోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది.  సీఎల్‌-20 అనేది అధిక శక్తి కలిగిన పదార్థమని, సంప్రదాయ ఆర్‌డీఎక్స్‌ కంటే మెరుగైన ఆక్సిడైజర్‌ ఇంధన నిష్పత్తి కలిగినదని శాస్త్రవేత్తలు తెలిపారు. సంప్రదాయ హెచ్‌ఎంఎక్స్‌ ఆధారిత ప్రొపెల్లెంట్ల కంటే 20 శాతం ఎక్కువ శక్తి సీఎల్‌-20 నుంచి తయారు చేయవచ్చునని వివరించారు. ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ లింగయ్య బృందం మిత ప్రతిచర్య పరిస్థితుల్లో తక్కువ మొత్తం ఉత్ప్రేరకం అవసరమయ్యేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతను శనివారం ఐఐసీటీ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్‌ టి.వి.చౌదరికి అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని