logo

కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ బదిలీ

కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అభిలాష అభినవ్‌ బదిలీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనవరి 5న ఇక్కడ పనిచేస్తున్న వి.మమతను బదిలీ చేస్తూ

Published : 16 Jun 2024 02:59 IST

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ అభిలాష అభినవ్‌ బదిలీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనవరి 5న ఇక్కడ పనిచేస్తున్న వి.మమతను బదిలీ చేస్తూ ఆమె స్థానంలో ఐఏఎస్‌ అధికారిణి అభిలాష అభినవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూకట్‌పల్లి జోన్‌ ఏర్పాటు తర్వాత మొదటి ఐఏఎస్‌ అధికారిణి జడ్సీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. 5 నెలల 10రోజులు ఆమె ఇక్కడ జడ్సీగా కొనసాగారు. ఐఏఎస్‌ అధికారుల బదిలీల్లో  ఈమెను నిర్మల్‌ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఎవరిని నియమించకపోవడంతో ఎవరు వస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని