logo

రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికి ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగన్‌పల్లి రామోజీ ఫౌండేషన్‌ ప్రభుత్వ పాఠశాల

Updated : 16 Jun 2024 05:09 IST

రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికి ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగన్‌పల్లి రామోజీ ఫౌండేషన్‌ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలివేలు అన్నారు. శనివారం పాఠశాలలో రామోజీరావు చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాల వేసి నివాళి అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. రామోజీ ఫౌండేషన్‌ నాగన్‌పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అనేక అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. రూ.కోట్లు ఖర్చుచేసి కార్పొరేట్‌ స్థాయిలో అన్ని వసతులతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారని, విద్యార్థులకు ఏటా ఉచితంగా ఏకరూప దుస్తులు, స్టడీ మెటీరియల్, డైరీలు, బూట్లు అందిస్తున్నారని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో రామోజీరావు వెలుగులు నింపారని, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.


కమ్మ సామాజికవర్గ ప్రయోజనాలకు తోడ్పాటు

రామోజీ మృతికి సంతాపంగా మౌనం పాటిస్తున్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీవీ రావు తదితరులు 

అమీర్‌పేట, న్యూస్‌టుడే: కమ్మ సామాజికవర్గ ప్రయోజనాలకు తోడ్పాటునందించే కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తీర్మానించింది. ఈ మేరకు అమీర్‌పేటలోని కమ్మసంఘం హాల్‌లో శనివారం సమాఖ్య రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీవీ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు హాజరయ్యారు. ముందుగా ఇటీవల కన్నుమూసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు సమాఖ్య ప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కమ్మవారి సేవా సంఘాల తరపున అభినందనలు తెలిపారు. సమాఖ్య ఆధ్వర్యంలో వీలైనంత త్వరలో సహకార బ్యాంకును స్థాపించడం ద్వారా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అవసరమైన రుణాలు, పిల్లలకు విద్యా రుణాలను మంజూరు చేసి తోడ్పాటునందించాలని నిర్ణయించారు. ¦్నరు. సమావేశంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి వెంకటేశ్వరావు, కోశాధికారి డా.పునకొల్లు నాగభూషణం, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని