logo

జిల్లా కలెక్టర్‌గా ప్రతీక్‌ జైన్‌

వికారాబాద్‌ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ప్రతీక్‌ జైన్‌ నియమితులయ్యారు. నేడు (ఆదివారం) ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌ ఛాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 16 Jun 2024 03:25 IST

నల్గొండకు నారాయణరెడ్డి బదిలీ

వికారాబాద్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి ప్రతీక్‌ జైన్‌ నియమితులయ్యారు. నేడు (ఆదివారం) ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌ ఛాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ విధుల్లో ఉన్న కలెక్టర్‌ నారాయణరెడ్డిని నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లను ప్రభుత్వ బదిలీ చేసింది. ఇందులో భాగంగా నారాయణరెడ్డిని కూడా బదిలీ చేశారు. ప్రతీక్‌జైన్‌ 2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. అంతకు ముందు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసులో సేవలందించారు. అజ్మీర్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. బదిలీపై వెళ్తున్న నారాయణరెడ్డి 2 ఫిబ్రవరి 2023లో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. మొత్తంగా 16 నెలల 13 రోజుల పాటు సేవలందించారు.

సి. నారాయణరెడ్డి 

సమర్థంగా విధుల నిర్వహణ

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా కొనసాగి బదిలీపై వెళుతున్న సి.నారాయణరెడ్డి జిల్లాలో పనిచేసింది తక్కువ సమయమే కావచ్చు. కానీ సమర్థంగా విధులు నిర్వహించి పలువురి మన్ననలను అందుకున్నారు.  2013 ఫిబ్రవరి 2వ ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యలను చేపట్టారు. శనివారం నాటితో 16 నెలల 13 రోజులు పూర్తయ్యాయి. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని ప్రజలు ఇచ్చే వినతులు విని పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించేవారు. జల్లాలో పరిష్కారం కాని సమస్యలున్నట్లయితే తగిన సలహాలు, సూచలను అందజేసేవారు. తన ఛాంబర్‌లోనే కాకుండా కార్యాలయంలో ఎక్కడ కలిసినా వినతులు స్వీకరించి శ్రద్ధగా వినేవారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల పట్ల  ప్రత్యేక శ్రద్ధ చూపించారు. 

  • 2023 నవంబర్‌ 30న జరిగిన శాసన సభ ఎన్నికలు, 13 మే 2024న జరిగిన లోక్‌సభ ఎన్నికలు ఆయన నేతృత్వంలో ప్రశాంతంగా ముగిశాయి. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు.

ఉద్యోగులతో తరచూ సమావేశాలు: ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అటెండెన్‌ యాప్‌ను ప్రారంభించారు.  దీంతో ఉద్యోగులు విధులకు సక్రమంగా రావటానికి తనవంతు కృషి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా, అంకితభావంతో విధులు నిర్వహించాలని అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో తరచుగా గుర్తుచేసేవారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు పూర్తిగా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారని, వసతి గృహ సంక్షేమాధికారులు తమ పిల్లల మాదిరిగా చూసుకోవాలని తల్లిదండ్రుల పాత్ర ను పోషించాలని సూచించేవారు. గత మే నుంచి ఆయన ప్రతి రోజు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా విద్యాధికారు లు, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వచ్చారు. 

రైతు సంక్షేమానికి తోడ్పాటు: జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ఆయన ప్రత్యేక చొరవ చూపారు.  వ్యవసాయాధికారులతో తరచుగా సమావేశాలను నిర్వహించారు. ఇటీవల వికారాబాద్‌ పట్టణంలో ఎరువులు, విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేసి వ్యాపారులతో  మాట్లాడారు. బదిలీపై వెళ్తుండటంతో జిల్లా ప్రజలు ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. 

అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ బదిలీ

వికారాబాద్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ (స్థానిక సంస్థలు) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయనను వికారాబాద్‌నుంచి బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన 8 నవంబర్‌ 2022లో వికారాబాద్‌ జిల్లా అదనపు పాలనాధికారిగా నియమితులయ్యారు. సమర్థంగా విధులు నిర్వహిస్తూ పలువురి మన్నలను అందుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని