logo

మురుగు కనుమరుగయ్యేలా

ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తయ్యే మురుగు చెరువులు, కుంటలు ఇతర జలవనరుల్లో కలిసిపోకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Published : 16 Jun 2024 03:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తయ్యే మురుగు చెరువులు, కుంటలు ఇతర జలవనరుల్లో కలిసిపోకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అమృత్‌ స్కీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మురుగు శుద్ధి కేంద్రాలను ఓఆర్‌ఆర్‌ చుట్టూ నిర్మించనున్నారు. ఇప్పటికే డీపీఆర్‌ను జలమండలి ప్రభుత్వానికి సమర్పించింది. త్వరలోనే అనుమతులు రానున్నట్లు అధికారులు తెలిపారు. అవుటర్‌ చుట్టూ 39 ప్రాంతాలను ఎంపిక చేశారు. రూ.3842 కోట్లు వెచ్చించనున్నారు. అమృత్‌ స్కీంలో కేంద్రం 25 శాతం, రాష్ట్రం 35, హైబ్రీడ్‌ యాన్యుటీలో గుత్తేదారు సంస్థ 40 శాతం నిధులు సమకూర్చనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని