logo

నకిలీలు గుర్తించేందుకు విజిలెన్స్‌ బృందాలు

పారిశుద్ధ్య కార్మికుల జీతాలను దోచుకునే వారిపై చర్యలుంటాయని జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం స్పష్టం చేసింది.

Updated : 16 Jun 2024 05:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: పారిశుద్ధ్య కార్మికుల జీతాలను దోచుకునే వారిపై చర్యలుంటాయని జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం స్పష్టం చేసింది. ‘హాజరుకు నకిలీ మకిలీ’ శీర్షికతో శనివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో పలు బృందాలు ముషీరాబాద్‌ సర్కిల్, బోలక్‌పూర్‌ డివిజన్‌కు చెందిన ఎస్‌ఎఫ్‌ఏను గుర్తించేందుకు వెళ్లారు. ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అనంతరం విజిలెన్స్‌ అధికారులు గ్రూపులో పనిచేస్తున్న ఇతర కార్మికులను విచారించారు. ఎస్‌ఎఫ్‌ఏ కారణంగా విధులకు దూరమైన కార్మికులను పనిలో చేరాలని ఆదేశించారు. ఇతర డివిజన్లలో పనిచేస్తోన్న ఎస్‌ఎఫ్‌ఏలు, కార్మికులందరినీ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని బల్దియా కార్యాలయానికి పిలిపించి, నకిలీ హాజరుపై విచారణ చేపట్టారు. ఎన్ని రోజులుగా దందా చేస్తున్నారో, కమిషనర్‌కు నివేదికిస్తామని అధికారులు ‘ఈనాడు’కు తెలిపారు.

అర్హతలేని సంస్థకు కాంట్రాక్టు..: ఫేషియల్‌ రికగ్నైషన్‌ స్కాన్‌ యాప్‌తో ఉద్యోగులు, సిబ్బంది హాజరు తీసుకునే విధానం అమలులో ఐటీ విభాగం అదనపు కమిషనర్‌ స్నేహ శబరీష్, కింది స్థాయి ఇంజినీర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారనే విమర్శలొస్తున్నాయి. అనుభవం, ప్రమాణాల్లేని సంస్థకు కాంట్రాక్టు అప్పగించారని ఆరోపణలొస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని