logo

కలుషిత జలాలు.. లీకేజీలు..

 సార్‌...మా ప్రాంతంలో మురుగు నీరు పొంగుతోంది.. మా బస్లీలో నల్లాల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి.. మా కాలనీలో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అవుతోంది..

Published : 16 Jun 2024 03:41 IST

డయల్‌ యువర్‌ ఎండీలో ప్రజల ఏకరవు

ఫోన్‌లో సమస్యలు వింటున్న సుదర్శన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌:  సార్‌...మా ప్రాంతంలో మురుగు నీరు పొంగుతోంది.. మా బస్లీలో నల్లాల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి.. మా కాలనీలో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అవుతోంది.. మా వీధిలో పైపుల లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది.. ఇలా అనేక సమస్యలపై గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డికి శనివారం ఫోన్‌లో ఏకరవు పెట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఇక్కడి నుంచే ఎక్కువగా..: ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నాగోలు, షేక్‌పేట్, గౌలిపురా, బాలానగర్, జూబ్లీహిల్‌స, పంజాగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్‌ ఇలా అనేక ప్రాంతాల నుంచి ఫోన్‌ చేసి ప్రజలు ఫిర్యాదు చేశారు. 155313కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా సరే...సకాలంలో స్పందించడం లేదని ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో గంటన్నర వ్యవధిలో 36 వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని అధికారులను ఎండీ ఆదేశించారు. తాగునీటి సరఫరా, మురగు నీటి నిర్వహణ, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొత్త నల్లాలకు ఓఆర్‌ఆర్‌ పరిధిలో పలువురు ఫోన్‌ చేసి ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టులో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి అయ్యిందని, సరఫరా లైన్లు నిర్మాణం అయిన వెంటనే కొత్త నల్లాలు జారీ చేస్తామని ఎండీ వారికి హామీ ఇచ్చారు. ఈడీ ఎం.సత్యానారాయణ, రెవెన్యూ డైరెక్టర్‌ వి.ఎల్‌.ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌-2 స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని