logo

చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

Updated : 17 Jun 2024 05:05 IST

మణికొండ, న్యూస్‌టుడే: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మణికొండ పంచవటికాలనీలో సీబీఎన్‌ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం ‘ఎన్డీయే’ విజయోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందలపు రవి, కోమటి జయరామ్, గారపాటి శ్రీనివాస్, సుమిత పాతూరి, సుమన్‌ వాసిరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు శేఖర్‌రెడ్డి, చందర్, బ్రహ్మాజీ, రాచమల్లు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలిపారు.   మీడియా రంగంలో రామోజీ కృషి ఎనలేనిదని కొనియాడారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని