logo

రాష్ట్రపతి నిలయంలో ఫాదర్స్‌డే వేడుకలు

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఫాదర్స్‌ డే వేడుకలను  నిర్వహించారు. ఈసందర్భంగా కుటుంబంలో తండ్రి పాత్రను, ఔన్నత్యాన్ని వివరిస్తూ వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేశారు.

Updated : 17 Jun 2024 05:02 IST

బొల్లారం, న్యూస్‌టుడే: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఫాదర్స్‌ డే వేడుకలను  నిర్వహించారు. ఈసందర్భంగా కుటుంబంలో తండ్రి పాత్రను, ఔన్నత్యాన్ని వివరిస్తూ వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేశారు. పలు నృత్య శిక్షణ సంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో నాన్న త్యాగాన్ని వివరిస్తూ ఆకట్టుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని అనాథాశ్రమాల నుంచి 700 మంది వృద్ధులు వచ్చి ప్రదర్శనలను తిలకించారు. బాలసదనాల్లోని పిల్లలకు తండ్రి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. అంతకుముందు నిలయం మేనేజర్‌ రజిని ప్రియ వేడుకలను ప్రారంభించి మాట్లాడుతూ.. తండ్రి ప్రేమ, బాధ్యతలను వివరించారు. ఆధునికత పేరుతో తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని