logo

‘సింధు దర్శన్‌’ యాత్ర ప్రారంభం 23న

దేశ ప్రజలందరినీ ఏకం చేసే లక్ష్యంతో హిమాలయ్‌ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ‘సింధు దర్శన్‌’ పేరిట యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాష్‌ సింగ్‌ తెలిపారు.

Published : 17 Jun 2024 01:38 IST

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: దేశ ప్రజలందరినీ ఏకం చేసే లక్ష్యంతో హిమాలయ్‌ పరివార్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 27 వరకు ‘సింధు దర్శన్‌’ పేరిట యాత్ర నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సూర్యప్రకాష్‌ సింగ్‌ తెలిపారు. లద్దాఖ్‌లోని లేహ్‌ నుంచి ఈ యాత్ర జరుగుతుందని చెప్పారు. ఇందులో పాల్గొనేందుకు 19న భాగ్యనగరం నుంచి అక్కడికి బయల్దేరి వెళ్తున్నామని తెలిపారు. ఆదివారం బర్కత్‌పురలోని సంస్థ కార్యాలయంలో ప్రచారపత్రాలను ఆవిష్కరించారు. పీవోకే, కైలాస మానస సరోవరంలలో త్రివర్ణ పతాకాలను ఎగురవేసి అఖండ భారత్‌ దిశగా ముందుకెళ్తామని లద్దాఖ్‌లో ప్రతిజ్ఞ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హిమాలయ్‌ పరివార్‌ సంస్థ ప్రతినిధులు పెరిక శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, సత్యేందర్‌సింగ్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు