logo

కారణజన్ముడు రామోజీరావు

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కారణ జన్ముడని పలువురు ఈటీవీ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.

Updated : 17 Jun 2024 04:54 IST

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు కారణ జన్ముడని పలువురు ఈటీవీ వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వ్యాఖ్యాతలు సుధాకర్, ప్రగతి ఈటీవీతో అనుబంధం ఉన్న వ్యాఖ్యాతలను ఆహ్వానించి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా రామోజీరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన కఠోర క్రమశిక్షణ అందరికీ మార్గదర్శకమన్నారు. రామోజీ ఒక వ్యవస్థ, గ్రంథాలయం అని కొనియాడారు. ఈటీవీలో నేర్చుకున్న ఓనమాలతో నేడు పోటీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మనగలుగుతున్నామని అన్నారు. భాష, సమయపాలన, నిబద్ధత ఈటీవీ నుంచే నేర్చుకున్నామని పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఇతర సంస్థల్లో పనిచేస్తున్నా ప్రజలు ఈటీవీ వ్యాఖ్యాతలుగానే గుర్తిస్తున్నారని, అది తమకెంతో సంతృప్తి ఇస్తోందన్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. అనేక ఛానళ్లలో పనిచేసినా ఈటీవీలో పొందిన గౌరవం ఎక్కడా దక్కలేదని మాజీ ఈటీవీ వ్యాఖ్యాతలు అన్నారు. సమావేశంలో వ్యాఖ్యాతలు కేఎల్‌ఎన్‌రావు, ఆర్‌వీ ప్రసాద్, స్వామి, భోగీంద్రనాథ్, దేవి, కిరణ్, డీవీఎన్‌ కిషోర్, కవిత, సుభాషిని, మధురవాణి, కామేశ్వరరావు, శ్యాంప్రసాద్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని