logo

జేఎన్‌టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

జేఎన్‌టీయూలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు సర్క్యులర్‌ జారీ చేశారు.

Published : 17 Jun 2024 01:46 IST

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు సర్క్యులర్‌ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా వసతిగృహంలో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పరిపాలనాపరమైన కొందరి పదోన్నతులపై తీసుకున్న నిర్ణయం, విద్యార్థుల పరీక్షలకు మెస్‌ ఛార్జీల చెల్లింపు నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన తదితరాల నేపథ్యంలో ఇన్‌ఛార్జి వీసీ బొర్రా వెంకటేశం వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని