logo

గోవులను రక్షించమంటే గోరక్షకులపైనే లాఠీఛార్జీ చేస్తారా...: రాజాసింగ్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలపై లాఠీ ఛార్జీ జరిపి, అరెస్టులు చేయడం ఎంత వరకు న్యాయమని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌ ప్రశ్నించారు.

Updated : 17 Jun 2024 05:00 IST

అబిడ్స్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందువులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలపై లాఠీ ఛార్జీ జరిపి, అరెస్టులు చేయడం ఎంత వరకు న్యాయమని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథ్‌ ప్రశ్నించారు. బక్రీద్‌ను పురస్కరించుకొని ఆవులు, దూడలు, ఎద్దులను చట్ట విరుద్ధంగా కబేళాలకు తరలిస్తున్నారంటూ సమాచారం ఇచ్చిన భాజపా, యువమోర్చా, గోరక్ష కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తుండడంపై ఆయన మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఒక వీడియో విడుదల చేశారు. మెదక్‌ ఠాణా పరిధిలో గోహత్యలను ఆపేందుకు గోభక్తులు పోలీసులకు సమాచారం ఇస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే అక్కడ శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయన్నారు. గోవులను వధించేందుకు తీసుకెళ్తున్నారని సమాచారం ఇచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేసి 24 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే గోరక్షకులపై దాడులు జరిగి ఉండేవి కావని, అందుకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడమే గోరక్షకులు చేసిన తప్పా... సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత పోలీసులపై లేదా..అని ఆయన ప్రశ్నించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు