logo

న్యూరో రిహబిలిటేషన్‌కు ఏఐ సాయం

మనకు ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో రాబోయే సమస్యలేంటో, వాటిని ఎలా నివారించుకోవచ్చో ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సులభమైన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని కిమ్స్‌ న్యూరో రిహబిలిటేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ అజయ్‌కుమార్‌ మిద్దె తెలిపారు.

Updated : 17 Jun 2024 04:58 IST

కిమ్స్‌ వైద్యుడు అజయ్‌కుమార్‌ 
ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: మనకు ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో రాబోయే సమస్యలేంటో, వాటిని ఎలా నివారించుకోవచ్చో ముందుగానే తెలుసుకునేందుకు కొన్ని సులభమైన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని కిమ్స్‌ న్యూరో రిహబిలిటేషన్‌ విభాగాధిపతి డాక్టర్‌ అజయ్‌కుమార్‌ మిద్దె తెలిపారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో న్యూరో రిహబిలిటేషన్‌ విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సదస్సును శని, ఆదివారాల్లో నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి 200 మందిపైగా ఫిజియోథెరపిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుళ్లి కిందపడిపోవడం వంటివి తరుచు మనం చూస్తాం. అంతేకాకుండా చాలామందికి మోకాళ్లు అరిగిపోవడం వల్ల మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు (నీ రీప్లేస్‌మెంట్‌) చేయాల్సి వస్తోంది. ఇళ్లలో ఉండే పెద్దవారు పడిపోవడంతో తుంటికి, ఇతర భాగాలకు గాయాలవుతుంటాయి. అలా పడిపోయే అవకాశం ఎంతవరకు ఉంది.. దానిని ఎలా నివారించాలన్నది ముందే తెలుసుకుంటే న్యూరో రిహబిలిటేషన్‌లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం దీన్ని సుసాధ్యం చేస్తోందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు