logo

చర్లపల్లి రైల్వేస్టేషన్‌ సిద్ధం

చర్లపల్లి శాటిలైట్‌ రైల్వే టర్మినల్‌ (స్టేషన్‌) పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులతో ఎన్ని ఇబ్బందులు ఎదురౌతున్నా అక్కడి నుంచే పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి.

Published : 17 Jun 2024 01:55 IST

ఆలస్యమౌతున్న ప్రారంభోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: చర్లపల్లి శాటిలైట్‌ రైల్వే టర్మినల్‌ (స్టేషన్‌) పూర్తయినా ప్రారంభానికి నోచుకోవడం లేదు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్నిర్మాణ పనులతో ఎన్ని ఇబ్బందులు ఎదురౌతున్నా అక్కడి నుంచే పూర్తిస్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. చర్లపల్లి రైల్వేస్టేషన్‌తో సికింద్రాబాద్‌ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించాలనే ఆలోచన ఉన్నతాధికారులు చేయడం లేదు.

ఎన్నికల కోడ్‌ ముగిసినా.. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించారు. ఎన్నికల ముందే దీనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినా కోడ్‌ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం, రైల్వే మంత్రిగా అశ్విన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించడం, కిషన్‌రెడ్డి మరోసారి కేంద్రమంత్రి అవడంతో ఇక త్వరలో చర్లపల్లి స్టేషన్‌ ప్రారంభోత్సవం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. 

సికింద్రాబాద్‌కు ఉపశమనమేదీ?.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ.720 కోట్లతో పునర్నిర్మిస్తున్నారు. ఒక పక్క పనులు జరుగుతుండగానే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇది ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. స్టేషన్లో పాదచారుల వంతెన నిర్మాణం పేరుతో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నారు. ప్లాట్‌ఫాంలు ఖాళీ లేక కొన్ని రైళ్లను శివార్లలోనే ఆపుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని