logo

రూ కోట్లు విడుదల.. తొలగనున్న ఇక్కట్లు!

కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యా ప్రగతికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా గురుకుల భవనాల నిర్మాణాలకు రూ.73.45 కోట్లు మంజూరు చేశారు.

Updated : 17 Jun 2024 04:57 IST

గురుకులాలకు సొంత భవనాల నిర్మాణం

న్యూస్‌టుడే, కొడంగల్‌: కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యా ప్రగతికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా గురుకుల భవనాల నిర్మాణాలకు రూ.73.45 కోట్లు మంజూరు చేశారు. తద్వారా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు ఇబ్బందులు తొలగుతాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 

మౌలిక వసతుల కల్పనకు వీలు 

కొడంగల్‌ పట్టణ శివారులో జ్యోతిబా ఫులే బాలుర గురుకుల పాఠశాల 15 సంవత్సరాలుగా కొనసాగుతోంది. సొంత భవనం నిర్మించినా గదుల కొరత, ఉపాధ్యాయులకు ఉండేందుకు వసతులు లేక అవస్థలు పడేవారు. ప్రస్తుతం గురుకుల పాఠశాలకు రూ.23.45 కోట్లు విడుదల చేయడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మౌలిక వసతులు కల్పించేందుకు వీలు కలిగింది. బీసీ బాలుర గురుకుల పాఠశాలలో దాదాపు 480 మంది విద్యార్థులకు సమస్యలు  తొలగనున్నాయి.

మొయినాబాద్‌కు వెళ్లాల్సి ఉండదు

కొడంగల్‌కు బీసీ గురుకుల కళాశాల 5 సంవత్సరాల క్రితం మంజూరు కావడంతో కొంత కాలం పాఠశాల గదుల్లోనే కొడంగల్‌లో కొనసాగించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మొయినాబాద్‌ సమీపంలోని కనకమామిడి వద్ద అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. దాదాపు 280 మంది విద్యార్థులున్నారు. కేవలం బాలుర గురుకుల కళాశాలకు రూ.25 కోట్ల నిధులు విడుదల కావడంతో కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలోని పాత కొడంగల్‌ గ్రామంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో విద్యార్థులు మొయినాబాద్‌ వెళ్లాల్సిన బాధ తప్పుతుంది.


చేవెళ్లలో అద్దె భవనంలో కొనసాగింపు

బొంరాస్‌పేట మండలం బూరాన్‌పూర్‌ గ్రామానికి మంజూరైన  బీసీ  బాలికల గురుకుల పాఠశాల, కళాశాలకు సొంత భవనం లేక పోవడంతో చేవెళ్ల సమీపంలోని ఊరేళ్ల గ్రామం సమీపంలో అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బాలికలకు సంబంధించి పాఠశాల  విద్యార్థులు,  కళాశాల విద్యార్థులు కలిపి సుమారు 680 మంది అక్కడ చదువు కొంటున్నారు. ఈ పాఠశాల, కళాశాలకు సంబంధించి రూ.25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటితో నిర్మాణాలు వీలైనంత తొందరగా పూర్తిచేసి భవనాలు అందుబాటులోకి తేవాల్సి ఉంది.


విద్యా హబ్‌గా మారుతుంది

- వెంకట్రెడ్డి, ‘కడా’ కార్యాలయం ప్రత్యేక అధికారి 

తాజాగా మంజూరైన నిధులతో పనులు వేగంగా చేపడతాం. తద్వారా కొడంగల్‌ మున్సిపాలిటీ విద్యా హబ్‌గా మారుతుంది. పేద విద్యార్థుల చదువుకు ఆటంకాలు దూరం అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు