logo

నీటి మీటర్ల మాయాజాలం

మీటర్లు ఎలాగూ బయటకు కనపడవు... ఎన్ని ఉన్నాయో..లేవో ఎవరికి తెలుస్తాయి..వాటి నాణ్యత ఎవరికి తెలుస్తుంది..ఇలా ఆలోచించిన ఏజెన్సీలు నీటి మీటర్లలో చేతివాటం ప్రదర్శించాయి.

Updated : 17 Jun 2024 04:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: మీటర్లు ఎలాగూ బయటకు కనపడవు... ఎన్ని ఉన్నాయో..లేవో ఎవరికి తెలుస్తాయి..వాటి నాణ్యత ఎవరికి తెలుస్తుంది..ఇలా ఆలోచించిన ఏజెన్సీలు నీటి మీటర్లలో చేతివాటం ప్రదర్శించాయి. నాణ్యత లేని మీటర్లే కాదు..వాటి లెక్కల్లోనూ తేడా ఉన్నట్టు జలమండలి అంచనా వేస్తోంది. ఇలాంటి ఏజెన్సీలను గుర్తించిన జలమండలి వారికి నోటీసులు జారీ చేసింది.  

గ్రేటర్‌ వ్యాప్తంగా:  నీటి బిల్లులను పక్కాగా నమోదు చేసేందుకు ఆటోమేటిక్‌ మీటర్‌ రీడర్ల(ఏఎంఆర్‌)కు జలమండలి టెండర్లు పిలిచి కొన్ని ఏజెన్సీలను ఎం-ప్యానల్‌ చేసింది. ఆయా సంస్థల నుంచి మీటర్లను కొనుగోలు చేసి వినియోగదారులకు అందించింది. గ్రేటర్‌ వ్యాప్తంగా 12,319 మీటర్లను సరఫరా చేసింది. ఒక్కో మీటరుకు కనీసం రూ.30 వేలకు పైగా ఖర్చు చేసింది.

ఇక్కడే తేడా...: ఏజెన్సీలు ఇచ్చే కమీషన్లతో అప్పట్లో కొందరు అధికారులు నాణ్యత లేని కంపెనీల మీటర్లను ఎంప్యానల్‌ చేసినట్లు తాజాగా రుజువవుతోంది. అమర్చిన మీటర్లలో ఇప్పటికే 20 శాతం వరకు పనిచేయడం లేదు. మరమ్మతులపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వెళుతున్నా ఏజెన్సీ కనీస స్పందన ఉండటం లేదు. ప్రస్తుతం ఏజెన్సీలకు నోటీసులతో సరిపెడతారా...లేదంటే వారిపై చర్యలు ఉంటాయా...? దానిపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని