logo

పట్టుకుంటున్నా.. పట్టించుకోరు

శిరస్త్రాణం ధరించరు.. రాంగ్‌ రూట్‌లో వెళ్తుంటారు.. సీసీ కెమెరాల కన్ను గప్పేందుకు నెంబరు ప్లేట్లకు మాస్క్‌లు.. నిబంధనలు పాటించమని పోలీసులు సదస్సులు, సమావేశాలతో అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు.

Published : 17 Jun 2024 02:14 IST

నగరంలో పెరిగిన ట్రాఫిక్‌  ఉల్లం‘ఘనులు’
ఐదు నెలల్లో 18 లక్షలకు పైగా కేసులు
ఈనాడు, హైదరాబాద్‌

శిరస్త్రాణం ధరించరు.. రాంగ్‌ రూట్‌లో వెళ్తుంటారు.. సీసీ కెమెరాల కన్ను గప్పేందుకు నెంబరు ప్లేట్లకు మాస్క్‌లు.. నిబంధనలు పాటించమని పోలీసులు సదస్సులు, సమావేశాలతో అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనులు పెరుగుతున్నారు. ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు 18 లక్షలకు పైగా ఈ-చలానాలు విధించటమే దీనికి నిదర్శనం. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 28 శాతం జరిమానాలు అధికంగా నమోదయ్యాయి. -

ఎవరైతే మాకేంటి?

మీర్‌చౌక్‌ వద్ద ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తున్నారు. వద్దని వారించిన అక్కడి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి సమీపంలో ఓ యువకుడు అడ్డదారిలో వస్తూ చిక్కాడు. అక్కడా అదే పరిస్థితి. శిరస్త్రాణం ధరించలేదు. రాత్రి 9 దాటితే నెంబరు ప్లేటు లేని వేలాది వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటిలో 20 శాతం చోరీ బండ్లే ఉంటాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, చార్మినార్, అమీర్‌పేట్, ఖైరతాబాద్‌ కూడలి ప్రాంతాల్లో అధిక శాతం బైక్‌లు అపసవ్య దిశలో ప్రయాణిస్తూ హల్‌చల్‌ చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలనే పౌరస్పృహ దూరమైందంటూ ఓ పోలీసు అధికారి ఆవేదన వెలిబుచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని