logo

349 మంది పట్టుబడ్డారు

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్‌లోని 14 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు.

Published : 18 Jun 2024 02:51 IST

సైబరాబాద్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు

తనిఖీలను పర్యవేక్షిస్తున్న ట్రాఫిక్‌ డీసీపీ డీవీ శ్రీనివాసరావు 
ఈనాడు, హైదరాబాద్‌: సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మందుబాబుల మత్తు వదిలించారు. శనివారం సాయంత్రం 6.30 నుంచి ఆదివారం అర్ధరాత్రి 2 గంటలు దాటే వరకు కమిషనరేట్‌లోని 14 ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించి 349 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒక బాలుడు, ముగ్గురు మహిళలున్నారు. రక్తంలో మద్యం మోతాదు (బీఏసీ) 11 మందికి 301-500గా వచ్చింది. ట్రాఫిక్‌ డీసీపీ డీవీ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. 253 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, 74 కార్లు, 6 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు