logo

సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందన దీప్తి

సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగాయి.

Published : 18 Jun 2024 02:53 IST

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందన దీప్తి బదిలీపై వస్తున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగాయి. అందులో భాగంగా ప్రస్తుతం రైల్వే ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్‌ సలీమాను వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా బదిలీ చేయగా.. ఆమె స్థానంలో ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్‌ 2012 బ్యాచ్‌కు చెందిన చందన దీప్తి సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. గతంలో ఆమె ఉత్తరమండలం డీసీపీగా పనిచేశారు. 

నార్త్‌ జోన్‌ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌

ఉత్తరమండలం డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్‌ బదిలీ అయ్యారు. ప్రస్తుతం నార్త్‌జోన్‌ డీసీపీగా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్‌ డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా పనిచేస్తున్న సాధన రష్మీ పెరుమాళ్‌ ఉత్తరమండలం డీసీపీగా బదిలీ అయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని