logo

భూ పరిపాలనలో మార్పులు తీసుకురావాలి

రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 18 Jun 2024 03:02 IST

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: రైతులకు మరింత చేరువయ్యేలా భూ పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలని తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ (టీజీటీఏ) నాయకులు కోరారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానానికి స్వస్తిపలికి పాత పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు. సంఘం కార్యాలయంలో సోమవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగాన్ని మరింత బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించే వ్యవస్థలను తేవాలన్నారు.  తహసీలార్ల సమస్యలు.. ధరణి, భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యదర్శులు రమేష్‌ పాక, అరేటి రాజేశ్వర్‌ ఉన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని